టాటా ట్రస్ట్స్ తొలి సీవోవోగా అపర్ణ ఉప్పలూరి

Tata Trusts appoints Aparna Uppaluri as COO - Sakshi

సాక్షి,ముంబై: టాటా ట్రస్ట్స్  కొత్త సీఈవో, సీవవో లను ఎంపిక చేసింది. సిద్ధార్థ్ శర్మను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, అపర్ణ ఉప్పలూరిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించింది.  ఈ నియామకాలు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లోకి వస్తాయని సంస్థ ఒక  ప్రకటనలో మంగళవారం తెలిపింది.

టాటా ట్రస్ట్స్  తొలి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా అపర్ణ ఉప్పలూరి  (48) ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఫోర్డ్ ఫౌండేషన్‌లో  భారతదేశం, నేపాల్ శ్రీలంకలకు ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్నారు ఆమె. 2018, మేలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఫౌండేషన్‌లో చేరిన ఆమె పరోపకారం, మహిళల హక్కులు, ప్రజారోగ్యం, కళలు  సాంస్కృతిక రంగాలలో వ్యూహాత్మక ప్రణాళిక కార్యక్రమాల అభివృద్ధిలో పాపులర్‌ అయ్యారు అపర్ణ.  జెండర్‌ ఈక్వాలిటీ  ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్లడంతోపాటు ఫోర్డ్ ఫౌండేషన్‌లో గ్రాంట్-మేకింగ్ కార్యక్రమాల నిర్వహణలో 20 ఏళ్ల లీడర్‌షిప్‌ , మేనేజ్‌మెంట్‌ అనుభవం ఆమె సొంతం.  

ఇక 2022లో టాటా ట్రస్ట్‌ల  సీఈవో పదవికి రాజీనామా చేసిన ఎన్ శ్రీనాథ్  ప్లేస్‌లో సిద్ధార్థ్ శర్మ శర్మ  ఎంపికైనారు. కాగా టాటా ట్రస్ట్స్, భారతదేశంలోని పురాతన స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి, టాటా సన్స్‌లో 66 శాతం వాటాను టాటా ట్రస్ట్స్   సొంతం.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top