టాటా కార్లు మరింత ప్రియం | Tata Motors to hike prices of passenger vehicles from May 01 | Sakshi
Sakshi News home page

టాటా కార్లు మరింత ప్రియం

Apr 15 2023 4:44 AM | Updated on Apr 15 2023 4:44 AM

Tata Motors to hike prices of passenger vehicles from May 01 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ కాస్త ప్రియం కానున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ధర సగటున 0.6 శాతం పెరగనుంది. మే 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది.

2023 ఫిబ్రవరి తర్వాత ధరలు పెంచడం ఇది రెండవసారి. నియంత్రణపర మార్పులు, ముడిసరుకు వ్యయం అధికం కావడం తాజా నిర్ణయానికి దారి తీసిందని టాటా మోటార్స్‌ తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement