సిబ్బందికి ఎయిర్‌ ఇండియా కొత్త రూల్స్‌.. ‘బట్టతల ఉంటే ప్రతి రోజూ షేవ్‌’

Tata Group Air India New Grooming Rules: Avoid Pearl Earrings, Colour Grey Hair - Sakshi

టాటా గ్రూప్‌.. ఈ సంస్థకు ఉన్న పేరు ప్రఖ్యాతలు, మార్కెట్లో వాటికున్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వ్యాపారంలో అడుగుపెడితే తమ సం​స్థ మార్క్‌ పని తీరుతో లాభాల బాట పట్టించడం టాటా గ్రూప్‌ ప్రత్యేకత. ఇటీవల భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్‌ ఇండియాను ఈ సం​స్థ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థను కూడా మిగిలిన సంస్థల మాదిరి లాభాలవైపు నడిపేందుకే వ్యూహాలు రచిస్తోంది టాటా గ్రూప్‌.

ఈ క్రమంలోనే యాజమాన్యంలో ఎయిర్‌ ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా విమానాల్లో పనిచేసే క్యాబిన్‌ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది.

ఈ క్రమంలోనే పురుషులు, మహిళా సిబ్బంది వస్త్రధారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. అందులో కొన్నింటిని తెలుసుకుందాం..

పురుషుల కోసం
►హెయిర్ జెల్ వాడకం తప్పనిసరి.
► బట్టతల లేదా జుట్టు ఎక్కువగా ఊడిపోయిన వారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. ఇ​క ప్రతి రోజూ షేవ్‌ చేసుకుంటూ ఉండాలి.
►తెల్లవెంట్రకలు ఉన్నవారు సహజ సిద్దంగా ఉండేలా వారి జుట్టుకు రంగు వేసుకోవాలి. ఫ్యాషన్‌ రంగులు, హెన్నా వంటివి వేసుకోకూడదు.

మహిళల కోసం
►ముత్యాల చెవిపోగులు ధరించకూడదు. ఫ్లైట్ అటెండెంట్‌లు డిజైన్ లేకుండా బంగారం లేదా డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించాలి.

►రింగ్స్ వెడల్పు 1 cm కంటే ఎక్కువగా ఉండకూడు. అది కూడా చేతికి ఒకటి మాత్రమే.
►అమ్మాయిలు కూడా జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్‌ లేదా కంపెనీ హెయిర్‌ కలర్‌ షేడ్‌ కార్డ్‌లో ఉండే రంగు వేసుకోవాలి.

చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్‌?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top