షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్‌?

UPI payment apps may soon impose transaction limit Check Details - Sakshi

సాక్షి,ముంబై: డిజిటల్‌ ఇండియాలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చాలా సర్వసాధారణమైపోయాయి. ప్రతీ చిన్న లావాదేవీకి గూగుల్ పే,  ఫోన్‌పే, పేటీఎం లాంటి పేమెంట్‌ యాప్స్‌పై ఆధారపడటం బాగా పెరిగింది. అయితే అపరిమిత యూపీఐ లావాదేవీలకు సంబంధించి   తాజా అంచనాలు యూజర్లకు షాకివ్వనున్నాయి. పేమెంట్ యాప్‌ల ద్వారా అన్‌లిమిటెడ్ పేమెంట్లు చేయకుండా నిబంధనలు త్వరలోనే అమల్లోకి రానున్నాయని  భావిస్తున్నారు. 

త్వరలో డిజిటల్ యూపీఐ పేమెంట్లపై ట్రాన్సాక్షన్ లిమిట్ విధించనున్నారని తాజా నివేదికల సమాచారం.  యూపీఐ డిజిటల్ సిస్టమ్‌లోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్‌ల (TPAP) వాల్యూమ్ క్యాప్‌ను పరిమితం చేయనుంది.  ఈ మేరకు వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేసే  విషయంపై రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ  PhonePe ఈ ఏడాది డిసెంబరు 31తోముగియనున్న గడువును కనీసం మూడు సంవత్సరాలు  పెంచాలని ఇప్పటికే  ఫోన్‌పే అభ్యర్థించింది. మరికొందరైతే  ఐదేళ్లు పొడిగించాలని కోరుతున్నారు.  అయితే  ఈ నెలాఖరులోగా ఎన్‌పీసీఐ నిర్ణయం తీసుకోనుంది. 

కాగా 2020లో ఈ లావాదేవీల పరిమాణాన్ని 30 శాతానికి పరిమితం చేసేలా ప్రతిపాదించింది. ఎన్‌పీసీఐ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ UPIలో నిర్వహించబడే లావాదేవీలను నియంత్రించాలని భావించింది. ఆ తరువాత దీని అమలును రెండు సంవత్సరాలకు పొడిగించింది. మరి ఈ గడువును పొడిగించే అవకాశం ఉందా లేదా అనే దానిపై నవంబర్ చివరి నాటికి దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేకుండా యూపీఐ యాప్‌ల చెల్లింపులు  చేసుకునే అవకాశం ఉంది. గూగుల్ పే,  ఫోన్‌పే  మార్కెట్‌లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top