Jewellers Offering Gold Schemes: రూ. 100కే గోల్డ్‌..! సరికొత్త వ్యూహంతో గోల్డ్‌ జ్యువెలర్స్ కంపెనీలు..!

Tanishq to Kalyan jewellers offering gold schemes starting 100 Rupees - Sakshi

దేశవ్యాప్తంగా కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితుల ప్రభావంతో బంగారం అమ్మకాలు ఒ‍క్కసారిగా పడిపోయాయి. ఇప్పుడిప్పుడే బంగారం అమ్మకాలు తిరిగి పుంజుకుంటున్నాయి.  కొనుగోలుదారులు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో బంగారం కొనుగోలుపై గణనీయంగా దృష్టిసారించారు. దీంతో పలు జ్వువెలరీ కంపెనీలు కూడా ఆన్‌లైన్‌ అమ్మకాలపై దృష్టిపెట్టాయి.
చదవండి: కంపెనీ బోర్డుల్లో 'మహిళలు తక్కువే'..పశ్చిమ, ఆసియా దేశాలతో పోలిస్తే

రూ.100 కే గోల్డ్‌..!
తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్, పీసీ జ్యువెలర్ లిమిటెడ్, సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వంటి గోల్డ్‌ జ్వువెలరీ కంపెనీలు కనిష్టంగా రూ. 100 కూడా  బంగారం అందించే ప్లాన్స్‌తో ముందుకువస్తున్నాయి.   కంపెనీ వెబ్‌సైట్లలో లేదా ఇతర థర్డ్‌యాప్స్‌  ద్వారా విక్రయించే ఆఫర్‌లను ప్రారంభించాయి. కాగా ఒక గ్రామ్‌ బంగారం కొనుగోలు చేసిన వారికే మాత్రమే గోల్డ్‌ జ్యవెలరీ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి.  

డిజిటల్ బంగారం అమ్మకాలు భారత్‌కు కొత్తేమీ కాదు...పేటిఏమ్‌, గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి మొబైల్ వ్యాలెట్స్‌ డిజిటల్‌ బంగారాన్ని అందిస్తున్నాయి. ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు , వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఆధారిత సేఫ్‌గోల్డ్ ఆయా మొబైల్‌ వ్యాలెట్లకు ఉత్పత్తి చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో నగలను విక్రయించే సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆగ్‌మాంట్‌ గోల్ట్‌ డైరక్టర్‌ కేతన్‌ కొఠారి పేర్కొన్నారు. 

అమ్మకాలను పెంచేందుకు..!
దసరా, ధంతేరాస్‌, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఈ సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌తో బంగారం అమ్మకాలను మరింత పెంచుకోవడానికి జ్యువెలరీ కంపెనీలు సిద్దమయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆన్‌లైన్‌లో విక్రయాలు 200 శాతం పెరిగినట్లు  గోల్డ్‌ జ్యువెలరీ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా 3 వేల నుంచి 4 వేల మధ్య ఉండే నాణేలు, బిస్కట్లపై ఎక్కువ బంగారం కొనుగోలు దారులు ఆసక్తిని చూపుతున్నారు. 
చదవండి: భారతీయుల హైట్‌ తగ్గిపోతోంది!!.. కాలుష్యంతో పాటు ఇవే కారణాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top