ఈ బ్యాంకు కస్లమర్లకు అలర్ట్‌..!

Syndicate Bank Account Holder Must Change Ifsc Code And Cheque Book - Sakshi

ముంబై: బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్నట్లు 2019 లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సిండికేట్‌ బ్యాంకు కెనరా బ్యాంకుతో విలీనమైంది. బ్యాంకుల వీలినంతో సిండికేట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు, చెక్‌బుక్‌లు జూన్‌ 30 వరకే చెల్లుబాటు కానుంది.  జూలై 1 నుంచి సిండికేట్‌ బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారనున్నాయి. ఈ మార్పును గమనించాలని,  వెంటనే చెక్‌బుక్‌లను ఆప్‌డేట్‌ చేసుకోవాలని కెనరా బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

సిండికేట్‌ బ్యాంకు ఖాతాదారులు జరిపే నెఫ్ట్‌, ఆర్జిజీఎస్‌, ఐఎంపీఎస్‌ లావాదేవీలు జరిపేటప్పుడు కచ్చితంగా కెనరా బ్యాంక్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను వినియోగించాలని తెలిపింది. పాత ఎమ్ఐసీఆర్‌, ఐఎఫ్ఎస్‌సీ లతో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న‌ ఈ-సిండికేట్ బ్యాంక్ చెక్ బుక్ కూడా జూన్ 30, 2021 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. థ‌ర్డ్ పార్టీకి జారి చేసిన ఈ-సిండికేట్ చెక్‌బుక్ లేదా చెక్‌లు జూన్‌30,2021వ తేది త‌రువాత చెల్ల‌వు. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని కెనరా బ్యాంకు ఖాతాదారులకు తెలిపింది.

చదవండి: క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తోన్న భారతీయులు..!

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top