ఆ మూడు సంస్థల ఉద్యోగులకు భారీ షాక్‌, త్వరలోనే తొలగింపు

Swiggy, Vedantu, Adobe Firing Hundreds Of Employees For Cost Cutting - Sakshi

ఆర్ధిక మాద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు కాస్ట్‌ కటింగ్‌ రూల్‌ను ఫాలో అవుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 20వేల మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేయగా..అడోబ్‌ సైతం మరో 100 మందిని ఇంటికి సాగనంపనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్విగ్గీ, ఎడ్యూటెక్‌ కంపెనీ వేదాంతులు’ వందల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. 

ఫుడ్‌ ఆగ్రిగేటర్‌ స్విగ్గీ ఈ డిసెంబర్‌ నెలలో 250మంది తొలగించనున్నట్లు సమాచారం. దీంతో పాటు రానున్న నెలల్లో స్విగ్గీకి చెందిన ఫుడ్ గ్రాసరీకి చెందిన వందల మందిపై వేటు వేసే ప్రణాళికల్లో ఉండగా..ఈ తొలగింపులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించలేదు. కానీ పనితీరు ఆధారంగా ఉద్యోగుల్ని ఉంచాలా? తొలగించాలా? అనేది తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం చెబుతుంది. 

సంస్థకు అనుగుణంగా విధుల నిర్వర్తించలేని ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం అందించింది. ఖర్చుల్ని ఆదా చేసేందుకు కంపెనీ తన ఇన్‌స్టామార్ట్ ఉద్యోగుల్ని సైతం ఉద్యోగం నుంచి తొలగించనుంది. 

అదేవిధంగా ఎడ్యుటెక్‌ కంపెనీ వేదాంతు  385 మంది ఉద్యోగులను తొలగించింది . కంపెనీ తన వర్క్‌ ఫోర్స్‌ను 11.6 శాతం తగ్గించినట్లు నివేదించింది. నిధుల కొరత కారణంగా ఈ ఏడాది వేదాంతు దాదాపు 1100 మందికి పింక్‌ స్లిప్‌ జారీ చేయగా..ప్రస్తుతం ఈ ఎడ్యుటెక్‌ కంపెనీలో  3,300 మందికి పైగా సిబ్బంది  ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం,అడోబ్ ఖర్చులను తగ్గించుకోవడానికి సేల్స్‌ విభాగంలో 100 మందిని తొలగించనున్నట్లు సమాచారం.అడోబ్ ‘కొంతమంది ఉద్యోగులను ఆయా డిపార్ట్‌మెంట్‌లకు మార్చింది. విధులకు అవసరమైన వారిని నియమించుటుంది. అవసరానికి మించి ఉన్న వారిని తొలగిస్తుందంటూ ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top