Swiggy: స్విగ్గీలో కొత్త చార్జీలు.. ప్రతి ఆర్డర్‌పైనా అదనంగా..

Swiggy starts charging customers platform fee - Sakshi

ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తోంది. విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌కు అదనంగా రూ. 2 'ప్లాట్‌ఫామ్ ఫీజు' పేరుతో వసూలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతానికి బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ అదనపు ఛార్జీలు  వసూలు చేస్తోంది. అయితే ఫుడ్‌ ఆర్డర్‌లపై మాత్రమే ఈ చార్జీలను స్విగ్గీ వసూలు చేస్తోంది. క్విక్‌-కామర్స్, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్‌లపై ఈ చార్జీలను ఇంకా విధించడం లేదు.

ఇదీ చదవండి: ఐఫోన్‌14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్‌.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు!

మరోవైపు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో స్విగ్గీ ఈ ఛార్జీలను ఇంకా ప్రవేశపెట్టకపోవడం గమనార్హం. గత వారంలో దశలవారీగా అమలులోకి వచ్చిన ఈ చార్జీలు ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది. రూ. 2 తక్కువగానే అనిపించినా స్విగ్గీ ప్రతిరోజు 1.5 మిలియన్లకు పైగా ఆర్డర్‌లను డెలివరీ చేస్తుంది. అంటే భారీ మొత్తంలోనే ఆదాయం వస్తుంది. ఈ మొత్తం వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి తగినంత భారీ కార్పస్‌ను సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్‌.. స్టాక్‌ మార్కెట్‌ యువ సంచలనం ఈమె!

డెలివరీ వ్యాపారం మందగించడమే ఈ కొత్త చార్జీలు వసూలుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక అనిశ్ఛిత పరిస్థితులకు కంపెనీ మినహాయింపు కాదు అని 380 ఉద్యోగాల తొలగింపు సందర్భంగా స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజెటీ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. కాగా మరో ప్రధాన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం ఇంకా ఎలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టలేదు. ఆదాయాల పరంగా చూస్తే జొమాటో ఆదాయం రూ. 4,100 కోట్లతో పోలిస్తే స్విగ్గీ ఆదాయం దాదాపు రూ. 5,700 కోట్లుగా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top