‘స్వరాజ్‌ కోడ్‌’.. ముందుగా తెలుగు రాష్ట్రాలకే

Swaraj Tractors Launches Codes Tractors For Horticulture Farmers - Sakshi

హార్టికల్చర్‌ రైతుల కోసం స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ ‘కోడ్‌’ 

న్యూఢిల్లీ: హార్టికల్చర్‌ రైతులకు సాగులో శ్రమను తగ్గించేందుకు తోడ్పడేలా స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ ‘కోడ్‌’ పేరిట కొత్త మెషీన్‌ను ఆవిష్కరించింది. పంట కోత తదితర అవసరాలకు కూడా ఉపయోగపడేలా ఇది చిన్న కమతాల్లో సైతం సులువుగా తిరగగలదని సంస్థ తెలిపింది. కూరగాయలు, పండ్లు మొదలైనవి పండించే రైతులకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని కంపెనీ పేర్కొంది.

ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీన్ని ప్రవేశపెడతామని, ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లోనూ దశలవారీగా అందుబాటులోకి తెస్తామని వివరించింది. ధర త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top