
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్‌లో 20 శాతం వాటా కొనుగోలుకి క్లియరెన్స్‌ను కోరుతూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్‌ఎంబీసీ) దరఖాస్తు చేసింది. యస్ బ్యాంక్‌లో 20 శాతం వాటా విక్రయించేందుకు గత నెలలో పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ)తోపాటు ఇతర 7 బ్యాంకింగ్ సంస్థలు నిర్ణయించాయి. రూ.13,483 కోట్ల విలువలో వాటా విక్రయానికి ప్రతిపాదించాయి.
ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’
దీని ప్రకారం యస్ బ్యాంక్‌లో వాటా మూలధనంతోపాటు.. ఓటింగ్ హక్కులను సైతం ఎస్‌ఎంబీసీ సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఈ డీల్ రికార్డ్ సృష్టించనుంది. జపాన్‌లో రెండో పెద్ద బ్యాంకింగ్ గ్రూప్ అయిన సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్‌ఎంఎఫ్‌జీ)నకు సొంత అనుబంధ సంస్థగా ఎస్‌ఎంబీసీ వ్యవహరిస్తోంది.