సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవార్డ్‌ల ప్రదానం! | Suchirindia Foundation 29th National And State Level Science Talent Search Examination | Sakshi
Sakshi News home page

సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు అవార్డ్‌ల ప్రదానం!

Apr 10 2022 1:45 PM | Updated on Apr 10 2022 2:02 PM

Suchirindia Foundation 29th National And State Level Science Talent Search Examination - Sakshi

సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 29వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్ష జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఘనంగా జరిగింది. వివిధ పాఠశాలల్లో నిర్వహించిన ఈ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షకు 1000 పాఠశాలల నుంచి 10వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

దేశ వ్యాప్తంగా..ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల పరిధిలో జరిగిన 29వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 48 మందికి నేషనల్ ర్యాంక్స్, రాష్ట్ర స్థాయి మెడల్స్, 300 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ ,10 మందికి గురుబ్రహ్మ ఛత్రాలయా అవార్డ్స్ లను విద్యార్ధులు దక్కించుకున్నారు.  

ఈ అవార్డ్‌ల ప్రదాన కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా సినీనటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్,డాక్టర్ జేవీఆర్‌ సాగర్, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ దాసరి బాలయ్య, సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతుల్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement