హైదరాబాద్ కంపెనీ బోనస్‌ షేర్లు | String Metaverse Bonus Shares June 19 Record Date | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ కంపెనీ బోనస్‌ షేర్లు

Jun 7 2026 7:40 AM | Updated on Jun 7 2026 11:25 AM

String Metaverse Bonus Shares June 19 Record Date

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్నాలజీ, డిజిటల్‌ ఇన్‌ఫ్రా కంపెనీ స్ట్రింగ్‌ మెటావర్స్‌ .. పబ్లిక్‌ ఇన్వెస్టర్లకు బోనస్‌ షేర్ల జారీని ప్రకటించింది. దీని ప్రకారం ప్రతి తొమ్మిది షేర్లకు గాను 2 షేర్లు లభిస్తాయి. ఇందుకు సంబంధించి నిర్వహించిన ఈ–వోటింగ్‌ ప్రక్రియలో మెజారిటీ షేర్‌హోల్డర్లు సానుకూలంగా ఓటింగ్‌ చేసినట్లు కంపెనీ తెలిపింది.

దీనికి జూన్‌ 19 రికార్డు తేదీగా ఉంటుందని స్ట్రింగ్‌ మెటావర్స్‌ సీఈవో రాఘవేంద్ర హునస్గి తెలిపారు. సంస్థలో కనీసం 25 శాతం పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ ఉండాలన్న నిబంధన అమలు దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ స్వచ్ఛందంగా బోనస్‌ ఇష్యూలో పాల్గొనడం లేదని కంపెనీ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement