ఏమన్నా ట్విస్టులా: చివరికి లాభాలే! | Stockmarkets ends with gains after volatile session | Sakshi
Sakshi News home page

ఏమన్నా ట్విస్టులా: చివరికి లాభాలే!

Jun 20 2022 3:34 PM | Updated on Jun 20 2022 3:38 PM

Stockmarkets ends with gains after volatile session - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఆరంభంలోను  కొనుగోళ్ల మద్దతుగా పాజిటివ్‌గా ఉన్నా తరువాత  దాదాపు సెషన్‌ అంతా లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట కొనసాగింది. గ్లోబల్‌ చమురు ధరల పతనంతో ఆయిల్‌రంగ షేర్లన్నీ కుప్పకూలి పోయాయి. దీంతో కీలక సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. కాని చివరి అర్థగంటలో భారీగా  ఎగిసాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు ఎగిసింది. చివరికి సెన్సెక్స్‌ 237 పాయింట్ల లాభంతో 51598 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు ఎగిసి 15350  వద్ద  ముగియడం విశేషం. 

దాదాపు అన్ని రంగాల షేర్లు స్తబ్దుగా ముగిసాయి.  మెటల్‌, రియల్టీ, ఆయిల్‌ రంగ షేర్లలో అమ్మకాలువెల్లువెత్తాయి.  ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీ పతనం ప్రభావాన్ని  చూపించాయి. హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏసియన్‌ పెయింట్స్‌, ఆల్ట్రా టెక్‌ సిమెంట్‌ లాభపడ్డాయి.  ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌,హిందాల్కో,  యూపీఎల్‌ ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు భారీగా నష్టపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement