మ్యూచుఫల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎలా ఉండాలి? | Stock Market weekend review Karunya rao with Hexagon Capital Srikant Bhagavat | Sakshi
Sakshi News home page

మ్యూచుఫల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు ఎలా ఉండాలి?

Sep 29 2023 4:42 PM | Updated on Sep 30 2023 3:41 PM

Stock Market weekend review Karunya rao with Hexagon Capital Srikant Bhagavat - Sakshi

ఈ వారం ఆరంభంలో నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిసాయి. నిఫ్టీ 19600 స్థాయికి చేరింది. ఈనేపథ్యంలో హెక్సాగాన్‌ కాపిటల్‌కు చెందిన శ్రీకాంత్‌ భగవత్‌ తో కారుణ్యరావు సంభాషణ విందాం. 

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు పెట్టినవారి పరిస్థితి ఎలా ఉండబోతోంది. 

నిఫ్టీతో పోలిస్తే మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌లు బాగా పెరిగాయి. క్విక్‌ రాలీతోపాటు వాల్యూయేషన్లను పరిశీలించాలి. కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచింది. అలాగే బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తూ డెట్‌ ఫండ్స్‌, బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? రిటర్న్న్‌ ఎలా ఉంటాయి అంటే  మిగతా అన్ని పరిస్థితులు బావుంటే.. మీడియం టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు మంచి ఫలితాలుండే అవకాశాలన్నాయి.  క్రెడిట్‌ గ్రోత్‌ రికవరీ అవుతున్న తరుణంలో కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్స్‌ ప్రాఫిట్స్‌ ఉండే అవకాశం ఉంది. అలాగే డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల వైవర్సిఫికేషన్‌ ఉంటుంది కాబట్టి రిస్క్‌ తక్కువ.

హైబ్రిడ్‌ ఫండ్స్‌లో టాక్స్‌ రిటర్న్‌ ఎక్కువ ఉంటుంది. ఈక్విటీ పండ్స్‌తో పోలిస్తే డెట్స్‌ ఫండ్స్‌తో రిస్క్‌ ఎలా ఉంటుంది? అనేది పరిశీలిస్తే మ్యూచుఫల్‌ డెట్‌ ఫండ్స్‌ ఈల్డ్స్‌ బావున్నాయి. ఇంట్రరెస్ట్‌, క్రెడిట్‌, లిక్విడిటీ అనే మూడు రిస్క్‌లు ఉంటాయి. వడ్డీరేట్లు పెరిగితే పాత బాండ్ల ధరలు పడతాయి. లిక్విడిటీ రిస్క్‌ ఉంటుంది. అయితే లాంగ్‌ టర్మ్‌ తీసుకుంటే రిస్క్‌ తక్కువ ఉంటుంది. కరెంట్‌ మార్కెట్‌లో లార్జ్‌ క్యాప్‌లో మీడియం టెర్మ ఫండ్‌ బావుంటుంది. పీఎస్‌యూ బ్యాంకుల కంటే  ప్రభుత్వ రంగ కంపెనీల బాండ్స్‌ మంచి   ఈ‍ల్డ్స్‌ ఇచ్చే అవకాశం ఉంది.  అయితే ఈ‍క్విటీ మార్కెట్లో దీర్ఘకాల పెట్టుబడులు  మంచిది.



 

(Disclaimer: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడి మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటుంది. మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలువారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప..వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement