
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. సోమవారం భారీగా పెరిగిన మార్కెట్లు, నిన్న తగ్గి ఈ రోజు మళ్లీ పెరిగాయి. బుధవారం ఉదయం 09:38 సమయానికి నిఫ్టీ(Nifty) 112 పాయింట్లు లాభపడి 24,681కు చేరింది. సెన్సెక్స్(Sensex) 314 ప్లాయింట్లు పుంజుకొని 81,439 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 100.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.29 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.46 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే పెరిగాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.72 శాతం లాభపడింది. నాస్‌డాక్ 1.61 శాతం ఎగబాకింది.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం, యూఎస్ బాండ్లపై రాబడులు పెరగడమూ నిన్నటి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ప్రథమార్థమంతా పరిమిత శ్రేణిలో బలహీనంగా ట్రేడయ్యాయి. ద్వితీయార్థం నుంచి అమ్మకాల తీవ్రత పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఒక దశలో మంగళవారం సెన్సెక్స్ 1,386 పాయింట్లు క్షీణించి 81,044 వద్ద, నిఫ్టీ 378 పాయింట్లు పతనమై 24,547 వద్ద కనిష్టాలు తాకాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)