సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 26 2024 12:57 PM | Updated on Apr 26 2024 12:57 PM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 22,326కు చేరింది. సెన్సెక్స్‌ 236 పాయింట్లు దిగజారి 73,618 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 88.04 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.64 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.02 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.10 శాతం ఎగబాకింది.

నిఫ్టీ నెక్ట్స్‌ 50 సూచీలో డెరివేటివ్‌ కాంట్రాక్టులను ఎన్‌ఎస్‌ఈ బుధవారం తీసుకొచ్చింది. మార్కెట్‌ నుంచి సానుకూల స్పందన వచ్చిందని, దేశవ్యాప్తంగా సూచీ డెరివేటివ్స్‌లో 375 మందికి పైగా ట్రేడింగ్‌ సభ్యులు పాల్గొన్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. ఫ్యూచర్స్‌లో రూ.78.16 కోట్ల విలువైన 1,223 కాంట్రాక్టులు, ఆప్షన్స్‌లో రూ.1.55 కోట్ల విలువైన 1,724 కాంట్రాక్టులు ట్రేడయ్యాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement