సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 15 2024 9:48 AM | Updated on Apr 15 2024 9:48 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ 238 పాయింట్లు నష్టపోయి 22,280కు చేరింది. సెన్సెక్స్‌ 778 పాయింట్లు దిగజారి 73,455 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 106.1 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 90.06 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.46 శాతం, నాస్‌డాక్‌ 1.62 శాతం నష్టంతో ముగిసింది. 

నేడు ఆసియా ప్రధాన సూచీలు నష్టాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) శుక్రవారం నికరంగా రూ.8,027 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.6,341.53 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement