సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్పంగా పెరిగిన మార్కెట్‌ సూచీలు

Mar 12 2024 9:25 AM | Updated on Mar 12 2024 9:26 AM

Stock Market Rally On Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 22,360కు చేరింది. సెన్సెక్స్‌ 76 పాయింట్లు పుంజుకుని 73,578 వద్ద ట్రేడవుతోంది.

డాలర్‌ ఇండెక్స్‌ 102.78 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.44 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.09 శాతానికి చేరాయి. సోమవారం డీఐఐలు రూ.3,238 కోట్లు, ఎఫ్‌ఐఐలు రూ.4,212 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్‌, విప్రో, హిందూస్థాన్‌ యూనిలీవర్, నెస్టే కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement