లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

May 17 2024 3:30 PM | Updated on May 17 2024 3:30 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,464 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 249 పాయింట్లు పుంజుకుని 73,917 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, మారుతీసుజుకీ, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

టీసీఎస్‌, నెస్లే, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌యూఎల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, భారతీఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement