సాక్షి మనీ మంత్ర: బేర్‌ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: బేర్‌ పంజా.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Apr 15 2024 3:30 PM | Updated on Apr 15 2024 3:31 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 241 పాయింట్లు నష్టపోయి 22,277 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 845 పాయింట్లు దిగజారి 73,399 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీసుజుకీ, నెస్లే, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ మినహా మిగతా అన్ని స్టాక్స్‌ నష్టాలతో ముగిశాయి. విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయినవాటి జాబితాలో ఉన్నాయి. 

యుద్ధభయాలు విస్తరించడం, వడ్డీ రేట్ల దిశపై అనిశ్చితికి తోడు ముడి చమురు ధరలు పెరుగుతుండడంతో కొంత మంది మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపినట్లు తెలిసింది. మ్యూచువల్‌ ఫండ్‌లలో ద్రవ్యలభ్యత అధికంగా ఉండటం వల్ల, సూచీలను కొంతవరకు ఆదుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లు బుధవారం (ఈనెల 17న) పనిచేయవు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement