సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: పుంజుకున్న స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Mar 21 2024 3:32 PM | Updated on Mar 21 2024 3:32 PM

Stock Market Rally On today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,055 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 104 పాయింట్లు దిగజారి 72,748 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్‌ ఎం, విప్రో, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. భారతిఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి సుజుకీ నష్టాల్లోకి జారుకున్నాయి. 

అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం బుధవారం రాత్రితో ముగిసింది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు పెరిగాయి. ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ 2024 ముగిసే వరకు మూడుసార్లు వడ్డీరేట్లు తగ్గిస్తామని ప్రకటించారు. అయితే ఈసారి మాత్రం కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement