Intraday Trading : గరిష్ట మార్జిన్‌ను 50 శాతానికి తగ్గించండి

Stock Brokers Association Request Sebi To Reduce Peak Margin - Sakshi

సెబీకి స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి 

న్యూఢిల్లీ: ఇంట్రాడే ట్రేడింగ్‌కు సంబంధించిన గరిష్ట స్థాయి మార్జిన్‌ను ప్రస్తుతం అమలవుతున్న 75 శాతం నుంచి 50 శాతానికి తగ్గించాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ ఏఎన్‌ఎంఐ విజ్ఞప్తి చేసింది. పీక్‌ మార్జిన్‌ను తగ్గించడం వల్ల వ్యక్తిగత ఇన్వెస్టర్లు, ట్రేడింగ్‌ చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే క్యాపిటల్‌ మార్కెట్‌ మరింతగా విస్తరించడానికి కూడా దోహదపడగలదని ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు తమ క్లయింట్ల నుంచి తీసుకోవాల్సిన మార్జిన్లకు సంబంధించి క్రమంగా పెరిగే గరిష్ట మార్జిన్‌ కాన్సెప్టును 2020 డిసెంబర్‌ నుంచి సెబీ అమల్లోకి తెచ్చింది. తొలుత 25 శాతంగా ఉన్న ఈ మార్జిన్‌ స్థాయి ప్రస్తుతం 75 శాతానికి పెరిగింది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top