సామాన్యులకు మరో కొత్త టెన్షన్.. ఇక మనం వాటిని కొనలేమా?

Steel prices hiked on the back of escalating geopolitical tension - Sakshi

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి అన్నీ పెట్రోల్, బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా సరఫరాలో అంతరాయం వల్ల దేశీయ ఉక్కు తయారీదారులు హాట్-రోల్డ్ కాయిల్(హెచ్‌ఆర్‌సీ), టీఎంటీ బార్ల ధరలను టన్నుకు రూ.5,000 వరకు పెంచారు. పరిశ్రమ వర్గాల ప్రకారం.. రెండు దేశాల మధ్య సంక్షోభం తీవ్రతరం కావడంతో వల్ల రాబోయే వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ధరల సవరణ తర్వాత, ప్రస్తుతం ఒక టన్ను హెచ్‌ఆర్‌సీ ధర సుమారు 66,000 రూపాయలు లభిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి."రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో సరఫరా గొలుసును ప్రభావితం చేస్తోంది. దీంతో, అనేక వస్తువుల ధరల ఇన్ పుట్ ఖర్చులు పెరుగుతున్నాయి. కోకింగ్ బొగ్గు టన్నుకు 500 అమెరికన్ డాలర్లుగా ట్రేడవుతోంది" అని ఒక పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. కొన్ని వారాల క్రితం రేట్లతో పోలిస్తే కోకింగ్ బొగ్గు ధర సుమారు 20 శాతం పెరిగింది అని ఆయన అన్నారు.

ఉక్కుతో సహా దేశీయ రంగాలపై ఈ రెండు దేశాల సంఘర్షణ ప్రభావం ఎంతో ఉంది అని అడిగినప్పుడు టాటా స్టీల్ సీఈఓ,ఎండి టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. "రష్యా, ఉక్రెయిన్ దేశాలు రెండూ బొగ్గు & సహజ వాయువుతో సహా ముడి పదార్థాల సరఫరాదారులుగా ఉండటమే కాకుండా ఉక్కు తయారు చేయడంతో పాటు ఎగుమతి కూడా చేస్తున్నట్లు" ఆయన పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సరఫరా-డిమాండ్ డైనమిక్స్, ఇన్పుట్ ఖర్చులతో సహ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఆటో, ఉపకరణాలు & నిర్మాణం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు ఉక్కు ముడిపదార్థం కాబట్టి, ఉక్కు ధరలు పెరగడం వల్ల ఇళ్లు, వాహనాలు, వినియోగ వస్తువుల ధరలు ప్రభావితం కావలసి ఉంటుందని ఒక నిపుణుడు తెలిపారు. 

(చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. పెట్టుబడి రూ.లక్ష లాభం రెండున్నర కోట్లు)

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top