అప్‌గ్రేడ్ చేతికి హరప్పా ఎడ్యుకేషన్

ముంబై: ఎడ్యుటెక్ సంస్థ హరప్పా ఎడ్యుకేషన్ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆన్‌లైన్ శిక్షణ ప్లాట్‌ఫాం అప్‌గ్రేడ్ వెల్లడించింది. ఇకపై వ్యవస్థాపకులతో పాటు హరప్పాలోని 180 మంది ఉద్యోగులు తమ సంస్థలో చేరతారని పేర్కొంది. ఈ కొనుగోలుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం 65 శాతం వృద్ధి చెందగలదని, రూ. 4,000 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ రోనీ స్క్రూవాలా వివరించారు.
హరప్పా ఎడ్యుకేషన్‌ను అప్‌గ్రేడ్ రూ. 300 కోట్లకు దక్కించుకుంది. 2015లో ఏర్పాటైన అప్‌గ్రేడ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,400 కోట్ల ఆదాయం నమోదు చేసింది. మరోవైపు, న్యూఢిల్లీకి చెందిన హరప్పా ఎడ్యుకేషన్‌కు ప్రమథ్ రాజ్ సిన్హా (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వ్యవస్థాపక డీన్) సహవ్యవస్థాపకులుగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ. 75 కోట్ల ఆదాయం ఆర్జించిన హరప్పా ఎడ్యుకేషన్ ఈసారి రూ. 250 కోట్లు లక్ష్యంగా నిర్దేశించుకుంది.
చదవండి: 5G Spectrum Auction: కంపెనీలు తగ్గేదేలే.. రికార్డ్ బ్రేక్, తొలి రోజు రూ.1.45లక్షల కోట్లు!