Sony India: సోనీ ఉత్పత్తులపై 60 శాతం మేర తగ్గింపు..! అందులో టీవీలు, హెడ్‌ఫోన్స్‌, ఇంకా మరెన్నో..!

Sony India Kicks Off Year End Sale With Discounts On Bravia Tv Audio Products - Sakshi

ఎలక్ట్రానిక్స్‌ గాడ్జెట్స్‌ తయారీదారు సోనీ ఇయర్‌ ఎండ్‌ సేల్‌ను గురువారం (డిసెంబర్‌ 16) నుంచి ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులు, టీవీలపై భారీ ఆఫర్లను సోనీ ప్రకటించింది. సోనీ ఇయర్‌ ఎండ్‌ సేల్‌ 2022 జనవరి 3 వరకు కొనసాగనుంది.  ఈ సేల్ ఆఫ్‌లైన్, పలు ఎలక్ట్రానిక్ స్టోర్స్‌, సోనీ ఆన్‌లైన్ స్టోర్స్‌తో పాటుగా  ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్స్‌ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

సోనీ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా పలు బ్రావియా టీవీలపై 30 శాతం మేర తగ్గింపు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను , రెండేళ్ల వారంటీని కొనుగోలుదారులకు సోనీ అందిస్తోంది. వీటితో పాటుగా వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌, హెడ్‌ఫోన్స్‌, బ్లూటూత్‌ స్పీకర్స్‌పై 60 శాతం మేర తగ్గింపును ప్రకటించింది. 

ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా సోనీ అందిస్తోన్న పలు ఆఫర్లు..!

Sony Bravia XR-65A8OJ టీవీ కొనుగోలుదారులకు రూ. 2,65,990 కే రానుంది. దీని రిటైల్ ధర రూ. 3,39,900. Sony Bravia KD-55X8OJ మోడల్‌ టీవీ ధర రూ. 87,390కు రానుంది. దీని అసలు ధర రూ. 1,09,900 గా ఉంది.

సోనీ WH-1000XM4 హెడ్‌ఫోన్స్‌ను కొనుగోలుదారులు రూ. 24,990 కే సొంతం చేసుకోవచ్చును. దీని అసలు ధర రూ. 29,990. సోనీ WH-H910N హెడ్‌ఫోన్స్‌పై ఏకంగా 60 శాతం తగ్గింపుతో రూ. 9,990కు రానుంది. దీని అసలు ధర రూ. 24,990

సోనీ WH-CH710N హెడ్‌ఫోన్స్‌ ధర రూ. 7,990కు, సోనీ WH-XB900N ధర రూ. 9,990 కే కొనుగోలుదారులకు లభ్యమవుతోంది.

సోనీ వైర్‌లెస్ టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌పై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది, సోనీ WF-1000XM3 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌ రూ. 9,990 ధరకు, సోనీ WF-SP800N TWS ఇయర్‌బడ్స్ ధర రూ. 10,990కు, సోనీ WF-XB700 ధర రూ. 6,990 కు రానున్నాయి.

సోనీ SRS-XB13 వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌పై రూ. 3,590 కు రానుంది. కంపెనీ వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లపై కూడా తగ్గింపులను అందిస్తోంది, సోనీ WH-CH510 , WI-XB400 మోడల్స్‌ వరుసగా రూ. 2,990, రూ. 2,790 కే రానుంది. 

చదవండి: ఏసర్‌ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ తగ్గింపు...! ఏకంగా రూ. 40 వేల వరకు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top