Software engineer laid off 4 times in a row - Sakshi
Sakshi News home page

Layoffs story: లేఆఫ్స్‌ దారుణం.. ఒకటీ రెండు కాదు.. నాలుగు సార్లు పీకేశారు!

Apr 6 2023 12:46 PM | Updated on Mar 20 2024 1:33 PM

Software engineer laid off 4 times - Sakshi

టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపరకు అడ్డుకట్ట పడటం లేదు. కొన్నేళ్ల క్రితమే మొదలైన తొలగింపులు ఇటీవల ఎక్కువయ్యాయి.  కంపెనీలు వేలాదిగా ఉ‍ద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి లేఆఫ్‌కు గురై ఉద్యోగం కోల్పోతేనే జీవనం దుర్భరంగా మారుతుంది. మరి చేరిన ప్రతి కంపెనీ ఉద్యోగం పీకేస్తే.. ఒకటీ, రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు..

(ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!)

బిజినెస్ ఇన్‌సైడర్ కథనంప్రకారం... కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, 33 ఏళ్ల జానెట్ అన్నే పనెన్ తన టెక్ కెరీర్‌లో వరుసగా నాలుగుసార్లు లేఆఫ్స్‌కు గురై ఉద్యోగాలు కోల్పోయారు. ఆమె మొదటి ఉద్యోగం రెడ్డిట్‌లో రెండు నెలల పాటు సోషల్ మీడియా అసిస్టెంట్‌గా చేశారు. ఆ కంపెనీ ఆమెతో పాటు మొత్తం బృందాన్ని తొలగించింది. 

ఆ తర్వాత ఆమె ఉబర్ హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం సంపాదించగలిగింది. అయితే అక్కడ రెండేళ్లు పని చేసిన తర్వాత కంపెనీ ఆమెకు పింక్ స్లిప్ అందజేసింది. ఆ తర్వాత ఆమె డ్రాప్‌బాక్స్‌ కంపెనీలో సపోర్ట్ ఇంజనీర్‌గా చేరారు. రెండేళ్ల తర్వాత ఆ కంపెనీ ఆమెను తొలగించింది. గత వారమే స్నాప్‌డాక్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరింది. ఇంతలోనే నాలుగో ఉద్యోగం కూడా పోయింది.

(త్వరలోనే యాపిల్‌ స్టోర్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌.. భారత్‌ రానున్న టిమ్‌కుక్‌!)

తన లేఆఫ్స్‌ గురించి పనెన్‌ భావోద్వేగంతో పేర్కొన్నారు. మొదటిసారి తనను తొలగించినప్పుడు చాలా బాధపడ్డానని చెప్పిన ఆమె మూడో సారి అయితే తనతో పనిచేసిన బృందాన్ని వీడుతున్నందుకు మనసుకు చాలా కష్టంగా ఉండిందని వివరించారు. ఇక తాజాగా నాలుగో సారి లే ఆఫ్‌తో తన ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

టెక్ దిగ్గజాలు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం..  ఈ సంవత్సరం ఒక్క మెటా, అమెజాన్‌, గూగుల్‌ కంపెనీలు మాత్రమే 60,000 మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 11,000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించిన మెటా ఇటీవల మరో 10,000 మందిని తొలగించింది. అమెజాన్‌ కూడా రెండు రౌండ్లలో 27,000 మందికి ఉద్వాసన పలికింది. ఇక గూగుల్ 12,000 మందిని తప్పుకోవాలని ఆదేశించింది.

(జీతం నుంచి టీడీఎస్‌ మినహాయింపు.. ఐటీ శాఖ కీలక ఆదేశాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement