బహుళపక్ష బ్యాంకులను పటిష్టం చేయాలి

Sitharaman Pitches For Strengthening Of Mdbs - Sakshi

న్యూఢిల్లీ: సీమాంతర సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ బ్యాంక్, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వంటి బహుళపక్ష అభివృద్ధి బ్యాంకులను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు.

జీ20కి భారత్, జీ7కు జపాన్‌ అధ్యక్షత వహిస్తున్న తరుణంలో ఈ దిశగా సమిష్టి కృషి చేయాలని ఆమె సూచించినట్లు ఆర్థిక శాఖ ఒక ట్వీట్‌లో తెలిపింది. సంక్షేమానికి పాటించాల్సిన ఆర్థిక విధానాలపై జపాన్‌లోని నైగతాలో నిర్వహించిన జీ7 సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.

పేద వర్గాలకు మార్కెట్లను, ప్రాథమిక సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీ తోడ్పడగలదని మంత్రి చెప్పారు. డిజిటల్‌ కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ప్రజలకు సాధికారత లభిస్తోందని పేర్కొన్నారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top