సింగరేణి.. సూపర్‌ హిట్‌! ఈ ఏడాది లాభం ఎంతంటే ?

Singareni Colleries Company Limited Profits For This Year - Sakshi

నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చిన సంస్థ

రూ. 16,512 కోట్ల అమ్మకాలు.. 924 కోట్ల లాభాలు  

సాక్షి, మంచిర్యాల: కరోనా పరిస్థితులను అధిగమించిన సింగరేణి సరికొత్త రికార్డు సృష్టించింది.  గతేడా ది కరోనా ప్రభావంతో నష్టాలను మూటగట్టుకోగా, ఈసారి మొదటి నెల నుంచే తిరిగి వృద్ధిని కొనసాగిస్తోంది. సంస్థ చరిత్రలో తొలిసారిగా రూ.16,512 కోట్ల మేర విద్యుత్, బొగ్గు అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించినట్లు యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

రూ.924 కోట్ల లాభం
గతేడాది కన్నా 63 శాతం అ«ధికంగా విక్ర యాలు జరిపి, ఈ ఆర్థిక సంవత్సరంలో గత 8 నెలల కాలానికిగాను రూ.924.40 కోట్ల లాభాలను ఆర్జించింది. బొగ్గు అమ్మకాల్లో రూ.13,973 కోట్లతో గతేడాది కంటే 75 శాతం అధికంగా వృద్ధి సాధించింది. రూ.2,539 కోట్ల మేర విద్యుత్‌ అమ్మకాలు జరిపి, గతేడాది కంటే 18 శాతం మెరుగ్గా పురోగమించింది.

గతంలో నష్టాలు
గతేడాది కోవిడ్‌ కారణంగా ఇదే సమయానికి సంస్థ రూ.1,038 కోట్ల నష్టాలను చవిచూసింది. బొగ్గుఅమ్మకాల్లో చూస్తే 75 శాతం, విద్యుత్‌ అమ్మకాల్లో 18 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది కంటే అధికలాభాలు సాధించినందుకు కార్మికు లు, అధికారులు, కార్మిక సంఘాలకు సీఎండీ శ్రీధర్‌ అభినందనలు తెలిపారు. వచ్చే మూడున్నర నెలల్లోనూ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలని కోరారు.
 

చదవండి:సింగరేణికి సోలార్‌ ఎక్సలెన్స్‌ పురస్కారం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top