హైదరాబాద్‌ నుంచి మరిన్ని ఫ్లయిట్లు | Singapore Airlines to pull Scoot out of Hyderabad to ramp up operations | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి మరిన్ని ఫ్లయిట్లు

Oct 12 2023 2:24 AM | Updated on Oct 12 2023 2:24 AM

Singapore Airlines to pull Scoot out of Hyderabad to ramp up operations - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌–సింగపూర్‌ రూట్లో అక్టోబర్‌ 29 నుంచి మరిన్ని ఫ్లయిట్లు నడపనున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ జీఎం (ఇండియా) సై యెన్‌ చెన్‌ తెలిపారు. ప్రస్తుతం వారానికి ఏడు సరీ్వసులు ఉండగా 12కి పెంచుకోనున్నట్లు వివరించారు.

అనుబంధ బడ్జెట్‌ విమానయాన సంస్థ స్కూట్‌ నిర్వహించే ఫ్లయిట్స్‌ స్థానంలో వీటిని నడపనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ నుంచి సరీ్వసులు ప్రారంభించి 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. హైదరాబాద్‌ మార్కెట్‌ నుంచి ఫుల్‌ సరీ్వస్‌లు, కార్గోకు డిమాండ్‌ పెరిగినట్లు చెన్‌ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement