సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు మూసివేత, ప్రపంచ దేశాల టెక్‌ కంపెనీలు..స్టార్టప్‌లలో కలవరం

Silicon Valley Bank Has Been Shut Down By Federal Deposit Insurance Corporation  - Sakshi

అంతర్జాతీయ సంస్థల నుంచి స్టార్టప్‌ కంపెనీల్లో కలవరం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్‌ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే అమెరికాకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంకు (Silicon Valley Bank)ను ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (Federal Deposit Insurance Corporation) మార్చి 10న షట్‌డౌన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్‌ మ్యూచువల్‌ తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది.

శాంతాక్లారా కేంద్రంగా 
శాంతాక్లారా కేంద్రంగా సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (svb).. బ్యాకింగ్‌ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. బ్యాంక్‌ డిపాజిట్లు, ఖజానా నిర్వహణ సంస్థలకు ( treasury management) లోన్స్‌, ఆన్‌లైన్‌ బ్యాకింగ్‌, విదేశీ మారక వాణిజ్యం (foreign exchange trade)తో పాటు  ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది. 

ఎస్‌వీబీ మూసివేతకు కారణం
ఎస్‌వీబీ షట్‌ డౌన్‌కు కారణంగా తన పేరెంట్‌ సంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ చేసిన నిర్వాకమేనని తెలుస్తోంది. ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ తన పోర్ట్‌ పోలియాలో  21 బిలియన్‌ డాలర్ల సెక్యూరిటీలు,2.25 బిలియన్ల షేర్లను విక్రయించినట్లు ప్రకటన చేసిందని బ్లూమ్‌బెర్గ్‌ నివేదించింది.ఎస్‌వీబీ బ్యాంకు సైతం నికర వడ్డీ ఆదాయం క్షీణించినట్లు నివేదించింది.

అతిపెద్ద 16వ బ్యాంక్‌ 
ఎస్‌వీబీ అమెరికాలోనే అతి పెద్ద 16వ బ్యాంక్‌. కాలిఫోర్నియా, మసాచుసెట్స్‌లలో 17 బ్రాంచీల నుంచి వినియోగదారులకు సేవలందిస్తుంది. బ్యాంక్‌ను ఎఫ్‌డీఐసీను షట్‌డౌన్‌ చేసిందన్న వార్తల నేపథ్యంలో ఎస్‌వీబీ ఆస్తుల విలువ మంచులా కరిగి 209 బిలియన్ల డాలర్ల నుంచి 175.4 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. 

80 బిలియన్‌ డాలర్ల నష్టం
ఎస్‌వీబీ ప్రకటన రావడంతో మదుపర్లు బ్యాంకులో చేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన వెంచర్‌ క్యాపిటలిస్టులు బ్యాంకులో ఉన్న పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని,డబ్బును ఉపసంహరించుకోవాలని తమ పోర్ట్‌ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. వెరసి ఎస్‌వీబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ షేరు 35 ఏళ్లలోనే అత్యంత దారుణంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60శాతం షేర్లు క్షీణించడంతో 80 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది.

స్టార్టప్‌లకే నష్టం
సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ టెక్నాలజీ స్టార్టప్‌లకు రుణాలు ఎక్కువ ఇచ్చింది. ఈ పరిణామంతో ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు.

చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్‌, ఆధార్‌ కార్డ్‌ ఉన్న వారికి గుడ్‌ న్యూస్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top