స్టాక్‌ మార్కెట్లో కరోనా సెగ: మూడురోజుల లాభాలకు చెక్

Sensex Nifty Edge Lower as corona case surge - Sakshi

50వేల దిగువనముగిసిన సెన్సెక్స్‌

కరోనా ఉధృతి, దెబ్బతిన్న సెంటిమెంట్‌ 

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లను కరోనా సెకండ్‌ వేవ్‌ వణికించింది. రోజుకురోజుకు కేసుల నమోదు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది.  దీంతో ఆరంభంలో లాభాల్లో ఉన్న మార్కెట్లు మిడ్‌ సెషన్‌ తరువాత నష్టాల్లోకి జారుకున్నాయి.  దీనికి తోడు వారాంతం కావడంతో  లాభాల స్వీకరణ కనిపించింది.  దీంతో సెన్సెక్స్‌  155 పాయింట్లు క్షీణించి 48591 వద్ద, నిప్టీ 39 పాయింట్ల నష్టంతో 14834 వద్ద ముగిసాయి.  దాదాపు అన్ని రంగాలషేర్లు నష్టాలతోనే ముగిసాయి. ఐటీ, ఫార్మా స్వల్పంగా లాభపడగా, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి.ఎల్ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్, దివీస్‌ ల్యాబ్స్, ఎస్‌బీఐ లైఫ్, భారత్ పెట్రోలియం క్షీణించాయి. అటు టాటా మోటార్స్, హిందుస్తాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, ఐటిసి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్, ఒఎన్‌జిసి, జెఎస్‌డబ్ల్యు స్టీల్ లాభాలు ఆర్జించాయి. (కరోనా కలకలం : 37 మంది వైద్యులకు పాజిటివ్)

మరోవైపు దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ  ప్రకారం గడచిన 24 గంటల్లో 1,31,968మంది కొత్తగా కోవిడ్-19 వైరస్ బారిన పడ్డారు. దీంతో వరసగా మూడో రోజూ లక్షా పదిహేనువేలకిపైగా కేసులు నమోదైనాయి.  నిన్న ఒక్కరోజే 780 మరణాలు సంభవించడం గమనార్హం. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top