చమురు షాక్‌: సెన్సెక్స్‌ ‘బేర్‌’ | Sensex losses nifty breaks16650 on record oil price | Sakshi
Sakshi News home page

చమురు షాక్‌: సెన్సెక్స్‌ ‘బేర్‌’

May 31 2022 3:36 PM | Updated on May 31 2022 3:38 PM

Sensex losses nifty breaks16650 on record oil price - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోముగిసాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు రికార్డ్‌ స్థాయికి చేరడంతో ఈక్విటీ బెంచ్‌ మార్క్‌ సూచీలు ఆరంభంలోనే భారీ నష్టాల్లోకి జారు కున్నాయి. రోజంతా అదేధోరణి కొనసాగి చివర్లో కాస్త తెప్పరిల్లిన సెన్సెక్స్‌ 359 పాయింట్లు  కుప్పకూలి 55566 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు నష్టంతో16584 వద్ద ముగిసాయి.  ఆయిల్‌ అండ్ గ్యాస్‌ సెక్టార్‌ తప్ప దాదాపు మిగతా అన్ని సెక్టార్లు నష్టాలను చవి చూశాయి. 

కోటక్‌ మహీంద్ర బ్యాంకు, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, హెడీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ,  ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, భారీగా నష్టపోయాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, ఎం అండ్‌  ఎం, ఎన్టీపీసీ, కోల్‌ ఇండియా లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో రూపాయ 77.63 వద్ద ముగిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement