ఒక్క రోజులో రూ. 1.2 లక్షల కోట్లు హాంఫట్‌ | Sensex loses 200 points Nifty also recovers | Sakshi
Sakshi News home page

StockMarketClosing: ఒక్క రోజులో రూ. 1.2 లక్షల కోట్లు హాంఫట్‌

Oct 10 2022 3:51 PM | Updated on Oct 10 2022 4:27 PM

Sensex loses 200 points Nifty also recovers - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఆరంభ లాభాలనుంచి భారీగా కోలుకున్నాయి. 700 పాయింట్లకు పైగా కుప్పకూలిన సెన్సెక్స్‌  చివర్లో 200 పాయింట్ల నష్టాలకు పరిమితమై 57991 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్లు క్షీణించి 17241వద్ద  స్థిరపడింది.  

యాక్సిస్‌ బ్యాంకు, టీసీఎస్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐషర్‌ మోటార్స్‌ లాభపడగా,  టాటా మోటార్స్‌, హీరో మోటోకార్ప్‌, ఆసియన్‌  పెయింట్స్‌, టైటాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, నెస్లే, ఐటీసీ  నష్టపోయాయి.

ఇంట్రాడేలో 826 పాయింట్లు పడిపోయి 57,365.68 వద్ద కనిష్టానికి చేరుకుంది. ఫలితంగా బీఎస్‌ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్టోబర్ 7న  రూ. 275.6 లక్షల కోట్ల నుండి రూ. 274.4 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఒక్క రోజులో  దాదాపు రూ. 1.2 లక్షల కోట్లను పెట్టుబడిదారులు నష్ట పోయారు. ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళనల నడుమ వరుసగా రెండో సెషన్‌లో బలహీనంగా ముగిసింది. అటు డాలరు మారకంలో రూపాయి 82.32 వద్ద ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement