
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్ ఆరంభంలో 200 పాయింట్లకుపైగా ఎగిసిన సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లు బలహీనంగా ఉన్నప్పటికీ మెటల్స్ ఎఫ్‌ఎంసీజీ స్వల్పంగా లాభపడుతున్నాయి.
డాక్టర్ రెడ్డీస్, కోటక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, విప్రో మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ టాప్ లూజర్స్‌గా ఉండగా, టైటాన్ , ఎన్‌టిపిసి , హెచ్‌యుఎల్ , ఏషియన్ పెయింట్స్ , ఎం అండ్ ఎం, టెక్ ఎం, మారుతీ, ఐటీసీ లాభపడుతున్నాయి . సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టంతో 55418 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 16544 వద్ద కొనసాగుతున్నాయి.