Stock Market Today: Sensex Crashes 1688 points, Nifty ends below 17100 points - Sakshi
Sakshi News home page

స్టాక్‌ మార్కెట్లకు బ్లాక్‌ ఫ్రైడే.. భారీగా పతనమైన సెన్సెక్స్, నిఫ్టీ

Nov 26 2021 4:11 PM | Updated on Nov 26 2021 4:19 PM

Sensex Crashes 1688 points, Nifty ends below 17100 points - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీగా పతనమయ్యాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ తిరిగి కొలుకొనలేదు. కరోనా కొత్త వేరియంట్​ వార్తలు, అంతర్జాతీయంగా లాక్​డౌన్​ భయాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడంతో మదుపరులు అమ్మకాలవైపే భారీగా మెగ్గుచూపారు. దేశీయంగా లోహ, రియల్టీ, ఆటో, బ్యాంకు రంగ షేర్లు దారుణంగా పతనం కావడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. చివరకు, సెన్సెక్స్ 1,687.94 పాయింట్లు (2.87%) క్షీణించి 57,107.15 వద్ద ఉంటే, నిఫ్టీ 509.80 పాయింట్లు (2.91%) క్షీణించి 17,026.50 వద్ద ముగిసింది. 

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.88 వద్ద ఉంది. నిఫ్టీలో జెఎస్ డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు భారీగా నష్టపోగా.. సిప్లా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, దివిస్ ల్యాబ్స్, నెస్లే, టీసీఎస్ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఫార్మా (దాదాపు 2 శాతం వరకు) మినహా అన్ని రంగాలలో సెక్టోరల్ సూచీలు 1-6 శాతం నష్టపోయాయి. 

(చదవండి: ఐపీవో ఎఫెక్ట్‌.. ఏకంగా బిలియనీర్‌ అయ్యాడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement