ఆగస్టు 1 నుంచి మళ్లీ అమల్లోకి
సెబీ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్‌చేంజ్‌ల ద్వారా కంపెనీలు తమ షేర్లను బైబ్యాక్ చేసేందుకు మళ్లీ వీలు కల్పిస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. 66 పని దినాల్లో బైబ్యాక్ పూర్తి చేయాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం షేర్లను కంపెనీలు తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రత్యేక బైబ్యాక్ విండో అంటూ ఉండదు.
మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పుడు షేర్ల ధరలకు మద్దతుగా నిల్చేలా, అలాగే మిగులు నిధులను షేర్‌హోల్డర్లకు తిరిగి ఇచ్చేందుకు కంపెనీలు విరివిగా ఉపయోగించుకునే విధానాన్ని పునరుద్ధరించేందుకు ఈ మార్పులు తోడ్పడతాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. నోటిఫికేషన్ ప్రకారం ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ ఆఫర్‌ని ప్రకటించిన నాలుగు రోజుల్లోగా ప్రారంభించాల్సి ఉంటుంది.
66 పని దినాల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో ఇందుకు ఆరు నెలల వ్యవధి ఉండేది. ఇకపై బైబ్యాక్‌ల కోసం మర్చంట్ బ్యాంకర్‌ని నియమించుకోవడమనేది కంపెనీ ఇష్టప్రకారంగా ఉంటుంది. బైబ్యాక్‌లో విక్రయించే షేర్లపై లాభాలకు కూడా ఎక్సే్చంజీల్లో షేర్ల విక్రయం తరహాలోనే, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది.


