ఆ కంపెనీలో విరుష్క పెట్టుబడులు.. ఐపీవోకు బ్రేక్‌ వేసిన సెబీ

Sebi Keeps Virat Kohli Backed Insurance Company Go Digit Ipo Suspension - Sakshi

న్యూఢిల్లీ: కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ గ్రూప్‌ కంపెనీ పెట్టుబడులున్న గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కంపెనీ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిలిపివేసింది. అయితే ఈ అంశాలపై సెబీ (వెబ్‌సైట్‌లో) ప్రస్తుతం ఎలాంటి స్పష్టతనూ ఇవ్వలేదు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌ ఆగస్ట్‌ 17న ప్రాథమిక పత్రాలను సెబీకి సమర్పించింది.

కంపెనీలో సుప్రసిద్ధ భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మకు పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. కంపెనీ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేసే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా మరో 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top