సంక్షోభంలోనూ కొనసాగుతున్న నిధుల సమీకరణ
వృద్ధి ప్రణాళికలతో ముందుకొస్తున్న సంస్థలు
అస్థిర పరిస్థితులున్నా, సెబీ గ్రీన్ సిగ్నల్
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దేశీయ ఈక్విటీ సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. అయినప్పటికీ ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనేందుకు సంకేతంగా సెబీ తాజాగా ఆరు కంపెనీల ఐపీఓలకు ఆమోదం తెలిపింది. యుద్ధ అస్థిరతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనే పబ్లిక్ ఇష్యూలకు ఆమోదం రావడం ఆసక్తికర పరిణామం. వృద్ధి ప్రణాళికలతో ముందుకొస్తున్న ఈ ఆరు కంపెనీలు సమీకరించనున్న నిధుల వినియోగం, ఆర్థిక స్థితి, భవిష్యత్ వ్యూహాలు తదితర వివరాలు ఇలా ఉన్నాయి.
విభిన్న రంగాలకు చెందిన ఎస్‌ఏఈఎల్ ఇండస్ట్రీస్, విశ్వరాజ్ ఎన్విరాన్‌మెంట్, సింబయోటెక్ ఫార్మాల్యాబ్, ప్రాసోల్ కెమికల్స్, నోపేపర్‌ఫామ్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, షా ఇన్వెస్టర్స్ హోమ్ లిమిటెడ్‌లు గతేడాది సెపె్టంబర్–డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మార్చి 25–27 మధ్య దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీవోలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.
ఎస్‌ఏఈఎల్ ఇండస్ట్రీస్
రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ ద్వారా రూ.4,575 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ.3,750 కోట్ల విలువైన ఈక్విటీలను కొత్తగా జారీ చేనుంది. అదనంగా రూ. 550 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారు ‘నార్త్‌ఫండ్’ ఆఫర్ చేయనుంది. సమీకరించే నిధులను తన అనుబంధ సంస్థలు ఎస్‌ఏఈఎల్ సోలార్ పీ5 ప్రైవేటు లిమిటెడ్, ఎస్‌ఏఈఎల్ సోలార్ పీ4 ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులుగా పెట్టడంతో పాటు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
విశ్వరాజ్ ఎన్విరాన్‌మెంట్
నీటి శుద్ధి, మురుగు నీటి నిర్వహణ రంగానికి చెందిన ఈ సంస్థ ఐపీఓలో భాగంగా రూ.1,250 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అదనంగా రూ.1,000 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్ ప్రీమియర్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఆఫర్ చేయనుంది. మొత్తంగా ఇష్యూ ద్వారా రూ. 2,250 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. సమీకరించే నిధుల ద్వారా తన అనుబంధ సంస్థల రుణాల చెల్లింపులు, అడ్వాన్స్‌డ్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు, సోలార్ పవర్ ప్రాజెక్టుల మూలధన వ్యయాలకు వినియోగించనుంది.
సింబయోటెక్ ఫార్మాల్యాబ్
ఫార్మా, బయోటెక్ రంగంలో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఐపీఓలో భాగంగా రూ.150 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు రూ.2,030 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. దీంతో మొత్తం రూ.2,180 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను వ్యాపార అవసరాలకు వినియోగించే అవకాశం ఉంది. ఫార్మా రంగంలో గ్లోబల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఐపీఓపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు.
ప్రాసోల్ కెమికల్స్
స్పెషాలిటీ కెమికల్స్ తయారీ సంస్థ ఐపీఓ ద్వారా రూ.500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.80 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.420 కోట్ల షేర్లను విక్రయించనుంది. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా దేశాలకు ఉత్పత్తులు సరఫరా చేస్తోంది.
షా ఇన్వెస్టర్స్ హోమ్
బ్రోకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఐపీఓ పరిమాణాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే 54 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. సమీకరించే నిధులను వ్యాపార విస్తరణ, టెక్నాలజీ అప్‌గ్రేడ్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
నోపేపర్‌ఫామ్స్
ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్టెక్) రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ రహస్య విధానంలో (కాని్ఫడెన్షియల్ ఫైలింగ్) ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది. తాజాగా సెబీ నుంచి పబ్లిక్ ఇష్యూకు అనుమతి లభించింది. అయితే ఇష్యూ పరిమాణాన్ని ఇంకా వెల్లడించలేదు.
లిస్టింగ్ బాటలో..
రెంటోమోజో: ఆన్‌లైన్ రెంటల్, సబ్‌్రస్కిబ్షన్ ప్లాట్‌ఫామ్ రెంటోమోజో ఐపీఓకు సిద్ధమైంది. ఇందులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు సమరి్పంచింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.150 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ప్రస్తుత షేర్‌హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 2.83 కోట్ల ఈక్విటీలను విక్రయానికి పెట్టినట్లు ముసాయిదా పత్రాల ద్వారా తెలిసింది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపు, గిడ్డంగులు ఎక్స్‌పీరియన్స్ స్టోర్లు, సాధారణ కార్పొరేట్, లీజు అద్దెలు లేదా లైసెన్స్ ఫీజుల చెల్లింపు అవసరాలకు వినియోగించుకుంటామని వెల్లడించింది.
భారత్ పెట్
సమీకృత ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అందించే భారత్ పెట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 120 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో రూ. 640 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 760 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లు రుణ చెల్లింపులు, రూ. 36 కోట్లు మెషీనరీ, పరికరాల కొనుగోలు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1998లో ఏర్పాటైన కంపెనీ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో పెట్ బాటిళ్లు, జార్లు, టిన్ కంటెయినర్లు, క్యాప్‌లు తదితర రిజిడ్ ప్యాకేజింగ్ ప్రొడక్టులున్నాయి.గతేడాది(2024–25) ఆదాయం రూ. 412 కోట్లకు చేరగా.. 51 కోట్ల నికర లాభం ఆర్జించింది.


