శుభవార్త..పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన మహీంద్రా...!

Save Up to Rs 81500 on Mahindra Cars This April - Sakshi

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్‌ దిగ్గజం మహీంద్రా పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. ఏప్రిల్‌ నెలకుగాను పలు మోడళ్లపై కొత్త ఆఫర్లు, తగ్గింపు జాబితాను మహీంద్రా విడుదల చేసింది. ఎంపిక చేసిన కార్లపై ఈ నెలలో కస్టమర్‌లు గరిష్టంగా రూ. 81,500 వరకు ఆదా చేసుకోవచ్చును. అయితే ఆఫ్‌ రోడ్‌ కార్‌ థార్‌, బొలెరో నియో, ఎక్స్‌యూవీ700 వంటి కార్లపై ఎలాంటి తగ్గింపు లేదు. కాగా  ఈ ప్రయోజనాలను కొనుగోలుదారులు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌, నగదు మార్పిడి బోనస్‌, కార్పొరేట్ బోనస్‌ రూపంలో ఉండనున్నాయి. 

పలు కార్లపై మహీంద్రా అందిస్తోన్న తగ్గింపులు ఇవే..!

మహీంద్రా KUV100 NXT
మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్‌ ఆఫర్ కింద రూ. 20,000 వరకు మొత్తంగా రూ. 61, 055 వరకు కొనుగోలుదారులు ఆదా చేసుకోవచ్చును. దీని ధర రూ.6.15 లక్షల నుంచి రూ.7.81 లక్షల వరకు ఉంది

మహీంద్రా బొలెరో
మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు  ఎక్సేఛేంజ్‌ బోనస్‌ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్‌ బోనస్‌ రూ. 3000, అదనంగా మరో రూ. 6 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. దీని ధరను రూ.8.99 లక్షల నుండి రూ.9.99 లక్షల వరకు ఉండనుంది. 

మహీంద్రా స్కార్పియో
 మహీంద్రా బొలెరో కారుపై కొనుగోలుదారులకు  ఎక్సేఛేంజ్‌ బోనస్‌ కింద రూ. 15,000 వరకు, కార్పోరేట్‌ బోనస్‌ రూ. 4000, అదనంగా మరో రూ. 15 వేల వరకు, ఇలా మొత్తంగా రూ. 34 వేల వరకు నగదు ప్రయోజనాలను పొందవచ్చును. మహీంద్రా స్కార్పియోను రూ. 13.18 లక్షల నుంచి రూ. 18.14 లక్షల వరకు విక్రయిస్తోంది.

మహీంద్రా XUV300
మహీంద్రా XUV300 కొనుగోలుపై రూ. 30,003 వరకు నగదు తగ్గింపు, ఎక్సేఛేంజ్‌ ఆఫర్ కింద రూ. 25,000 వరకు ప్రయోజనాలను మహీంద్రా కల్పించనుంది. దాంతో పాటుగా రూ. 4000 కార్పొరేట్ తగ్గింపుతో పాటు అదనంగా రూ. 10 వేల వరకు నగదు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 8.16 లక్షల నుంచి రూ. 13.67 లక్షల వరకు ఉంది.

మహీంద్రా అల్టురాస్
మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై కంపెనీ ఏకంగా రూ. 81,500  భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది. అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైనఅదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. మహీంద్రా తన పూర్తి-పరిమాణ SUVని రూ. 28.84 లక్షల నుంచి రూ. 31.84 లక్షల వరకు విక్రయిస్తోంది.

మహీంద్రా మరాజ్జో
మహీంద్రా మరాజో ఎస్‌యూవీ బేస్ M2 ట్రిమ్‌పై రూ. 20,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్‌ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.  మహీంద్రా ఈ ఎమ్‌పివి ధరను రూ. 12.8 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు నిర్ణయించింది.

చదవండి: గుడ్‌న్యూస్‌...పలు కార్లపై భారీ తగ్గింపును ప్రకటించిన టాటా మోటార్స్‌...!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top