శామ్‌సంగ్ కొత్త ఫోన్‌ వివరాలు లీక్‌? | samsung-galaxy-z-fold-8-leak-foldable-war | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ కొత్త ఫోన్‌ వివరాలు లీక్‌?

Jul 12 2026 11:01 AM | Updated on Jul 12 2026 11:34 AM

samsung-galaxy-z-fold-8-leak-foldable-war

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ (మడిచే స్క్రీన్) ఫోన్ల విభాగంలో ఆధిపత్యం కోసం అగ్రగామి సంస్థల మధ్య పోటీ ఊపందుకుంది. కొరియన్ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన తదుపరి తరం ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకురావడానికి ముందే టెక్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల చివర్లో జరగబోయే ప్రతిష్టాత్మక ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో లాంచ్ కానున్న శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 మోడల్.. దక్షిణ కొరియాలోని ఒక అధికారిక రిటైల్‌ స్టోర్‌లో ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది.

లీకైన డమ్మీ యూనిట్లు.. ఈసారి మూడు మోడళ్లు?

ప్రముఖ గ్లోబల్ టిప్‌స్టర్ ‘ఐస్ యూనివర్స్’ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. దక్షిణ కొరియాలోని ఒక శామ్‌సంగ్ స్టోర్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 8 డమ్మీ మోడళ్లను ప్రదర్శనకు ఉంచినట్లు వెల్లడైంది. లీకైన చిత్రాలను బట్టి చూస్తే ఈ సరికొత్త ఫోన్ వైట్ కలర్ ఫినిషింగ్, వెనుక భాగంలో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్‌తో సరికొత్త డిజైన్‌లో కనిపిస్తోంది.

సాధారణంగా ఏటా శామ్‌సంగ్ రెండు ఫోల్డబుల్ ఫోన్లను మాత్రమే పరిచయం చేస్తుంది. కానీ ఈ ఏడాది సరికొత్త వ్యూహంతో ఏకంగా మూడు ఫోల్డబుల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8

  • శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8

  • శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వైడ్

జులై 22న అధికారిక లాంచ్‌

శామ్‌సంగ్ తన అధికారిక గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను జులై 22, 2026న నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ వేదికపైనే సరికొత్త Z ఫోల్డ్ 8 సిరీస్‌తో పాటు మరికొన్ని అత్యాధునిక గ్యాడ్జెట్లను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించనుంది. మునుపటి మోడళ్లతో పోలిస్తే ఈసారి సాఫ్ట్‌వేర్ పర్ఫార్మెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Galaxy AI) ఫీచర్లు, ఫోల్డింగ్ క్రీజ్ కనిపించకుండా మరింత ద్రుఢమైన డిస్‌ప్లే టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది.

యాపిల్ ఐఫోన్ ఆల్ట్రా ఫోల్డ్‌తో పోటీ?

శామ్‌సంగ్ ఇన్నాళ్లూ ఫోల్డబుల్ మార్కెట్లో కీలకంగా ఉన్నప్పటికీ, ఈసారి యాపిల్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. యాపిల్ సంస్థ సైతం తమ మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ ఆల్ట్రా పోల్డ్‌’ను తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. ఇటీవల యాపిల్‌ హబ్ అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన ఒక లీక్డ్ వీడియో టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement