శాంసంగ్‌ నుంచి 72 టీవీ మోడల్స్‌ | Samsung Launches 72 New Vision AI TV Models in India | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ నుంచి 72 టీవీ మోడల్స్‌

May 28 2026 7:26 PM | Updated on May 28 2026 7:44 PM

Samsung Launches 72 New Vision AI TV Models in India

శాంసంగ్‌ ఇండియా తాజాగా విజన్‌ ఏఐ టీవీ శ్రేణిని ఆవిష్కరించింది. 72 టీవీ మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. వీటిలో మైక్రో ఆర్‌జీబీ, ఓఎల్‌ఈడీ, నియో క్యూఎల్‌ఈడీ, మినీ ఎల్‌ఈడీ మొదలైనవి ఉన్నాయి. శాంసంగ్‌ టీవీ ప్లస్‌ ద్వారా ఉచిత కంటెంట్, కేర్‌ ప్లస్‌ ద్వారా అదనపు వారంటీ మొదలైనవి పొందవచ్చు.

పరిమిత కాలం పాటు నిర్దిష్ట టీవీ మోడల్స్‌పై కాంప్లిమెంటరీగా రూ. 1,02,990 విలువ చేసే సౌండ్‌బార్, రూ. 23,990 విలువ చేసే మ్యూజిక్‌ స్టూడియో ఉచితంగా లభిస్తాయని సంస్థ తెలిపింది. యూహెచ్‌డీ టీవీల శ్రేణి ధర రూ. 36,990 నుంచి, మైక్రో ఆర్‌జీబీ రేటు రూ. 1,24,990 నుంచి ప్రారంభమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement