గెలాక్సీ నోట్ ఫోన్లకు శాంసంగ్ స్వస్తి

Samsung Galaxy Note Smartphones Said to Be Discontinued in 2021 - Sakshi

వచ్చే ఏడాది శామ్‌సంగ్ తన ప్రీమియం గెలాక్సీ నోట్ ఫోన్‌ను నిలిపివేయవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ల డిమాండ్ గణనీయంగా తగ్గినా కారణంగా వీటిని వచ్చే ఏడాది నిలిపివేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. పెద్ద స్క్రీన్‌, ఆకర్షణీయమైన డిజైన్‌, ఎస్‌ పెన్ వంటి ఎన్నో ప్రత్యేకతలు నోట్ ఫోన్లలో ఉన్నాయి. అలాగే గతంలో ప్రీమియం ఫోన్ సిరీస్ గెలాక్సీ ఎస్, గెలాక్సీ నోట్ ఫోన్‌ లను కలిపి ఒకే ఫోన్ తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ 2021లో గెలాక్సీ నోట్ తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కనిపించడంలేదు. అయితే ఈ విషయంపై శామ్‌సంగ్ ఎటువంటి సమాచారం వివరణ ఇవ్వలేదు.(చదవండి: ఛాట్ ఛాట్‌కి కొత్త వాల్‌పేపర్‌)

సామ్‌సంగ్ నోట్ సిరీస్ అమ్మకాలు ఈ ఏడాది 8 నుంచి 5 మిలియన్లకు తగ్గుతాయని, ఎస్ సిరీస్ అమ్మకాలు 30 మిలియన్ల నుంచి 5 మిలియన్లకు తగ్గే అవకాశం ఉందని పరిశోధనా సంస్థ కౌంటర్ పాయింట్ విశ్లేషకుడు టామ్ కాంగ్ తెలిపారు. "ఈ సంవత్సరం ప్రీమియం డిమాండ్ తగ్గింది మరియు చాలా మంది కొత్త ఉత్పత్తుల కోసం చూడటం లేదు" అని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో గెలాక్సీ నోట్ 20ని అమెరికాలో 999 డాలర్లకు విడుదల చేయగా, గెలాక్సీ ఎస్20ని 799 డాలర్లకు విడుదల చేసింది. శామ్సంగ్ మొట్టమొదటిసారిగా 2011లో నోట్‌ను ప్రారంభించింది, ఆ సంవత్సరంలో ఆపిల్‌ను అధిగమించి తొలిసారిగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారుగా నిలిచింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top