
శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-సీఈఓ హాన్ జోంగ్ హీ (63) కన్నుమూశారు. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో శామ్‌సంగ్ గ్లోబల్ లీడర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన హాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణం ప్రపంచంలోని టెక్నాలజీ కంపెనీల్లో విషాధాన్ని నింపింది.
1988లో ఇన్హా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత శామ్‌సంగ్‌తో హాన్ జోంగ్ హీ ప్రయాణం మొదలైంది. ఆయన సంస్థ విజయానికి గణనీయమైన సహకారం అందించారు. విజువల్ డిస్‌ప్లే బిజినెస్‌లో ప్రొడక్ట్ ఆర్ అండ్ డీ టీమ్‌కు నాయకత్వం వహించడం నుంచి 2017లో విభాగానికి నాయకత్వం వహించడం వరకు టెలివిజన్ మార్కెట్‌లో శామ్‌సంగ్‌ను లీడర్ తీర్చిదిద్దడంతో హాన్ కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి: అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల రికవరీ సులభతరం
2021లో హాన్ శామ్‌సంగ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ డివైజ్ విభాగాన్ని పర్యవేక్షిస్తూ వైస్ ఛైర్మన్, సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. గృహోపకరణాలు, గెలాక్సీ పరికరాలతో సహా శామ్‌సంగ్ ప్రోడక్షన్ ఎకోసిస్టమ్‌లో కృత్రిమ మేధను ఏకీకృతం చేయడంలో అతని నాయకత్వం ప్రధానంగా నిలిచింది.