Samantha Inaugurates First Store Of Mangalya Shopping Mall In AP Kadapa - Sakshi
Sakshi News home page

కడపలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌

Dec 13 2021 4:42 AM | Updated on Dec 13 2021 9:40 AM

Samantha inaugurates Mangalya shopping mall in Kadapa - Sakshi

కడప: వైఎస్సార్‌ జిల్లా కడప నగరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటైన మాంగళ్య షాపింగ్‌ మాల్‌ను సినీ తార సమంత ఆదివారం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ తక్కువ కాలంలోనే నాణ్యమైన, మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా నిల్చిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఇది తమకు 11వ షోరూమ్‌ అని, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదని సంస్థ వ్యవస్థాపకులు పీఎన్‌ మూర్తి, చైర్మన్‌ కాసం నమఃశివాయ వివరించారు.

25000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో, 4 అంతస్తులలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిటైల్‌ ఫ్యాషన్‌ స్టోర్‌గా 1942లో ప్రారంభమైన కాసం గ్రూప్‌లో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ భాగమని, ప్రస్తుతం గణనీయంగా కార్యకలాపాలు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌ బాబు, ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్లు ముంతాజ్‌బేగం, నిత్యానందరెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ ఎం. రామలక్ష్మణ్‌రెడ్డి హాజరయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement