సాగర్‌ సిమెంట్స్‌ చేతికి ఆంధ్రా సిమెంట్స్‌ | Sagar Cements Emerges Successful Bidder To Acquire Andhra Cements Andhra Cements | Sakshi
Sakshi News home page

సాగర్‌ సిమెంట్స్‌ చేతికి ఆంధ్రా సిమెంట్స్‌

Jan 18 2023 10:55 AM | Updated on Jan 18 2023 10:55 AM

Sagar Cements Emerges Successful Bidder To Acquire Andhra Cements Andhra Cements - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్‌ ఇక  సాగర్‌ సిమెంట్స్‌ పరం కానుంది. ఈ మేరకు విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది. జేపీ గ్రూప్‌ కంపెనీ అయిన ఆంధ్రా సిమెంట్స్‌ ప్రస్తుతం కార్పొరేట్‌ దివాలా పరిష్కార ప్రక్రియలో ఉంది. సాగర్‌ సిమెంట్స్‌ దాఖలు చేసిన పరిష్కార ప్రణాళికకు అనుకూలంగా ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ (సీవోసీ) మెజారిటీతో ఓటు వేసింది.

సాగర్‌ సిమెంట్స్‌ ప్రణాళికను సీవోసీ ఆమోదించింది. పృథ్వీ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్, సెక్యూరిటైజేషన్‌ కంపెనీ లిమిటెడ్‌  పిటిషన్‌ ఆధారంగా ఆంధ్రా సిమెంట్స్‌పై దివాలా ప్రక్రియను ప్రారంభించాలని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ హైదరాబాద్‌ బెంచ్‌ గతేడాది ఏప్రిల్‌లో ఆదేశించింది. ఆంధ్రా సిమెంట్స్‌కు  దాచేపల్లి సమీపంలో, అలాగే విశాఖపట్నం వద్ద ఒక్కో ప్లాంటు ఉంది.

చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!


 

Advertisement
 
Advertisement
Advertisement