
హైదరాబాద్: రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ పరిశ్రమలోనే మొదటిసారిగా వాహన బీమాకు సంబంధించి మూడు యాడాన్ కవర్‌లను ప్రవేశపెట్టింది. ప్రైవేటు కార్లకు ‘స్మార్ట్ సేవ్’ పేరుతో యాడాన్ కవరేజీని విడుదల చేసింది. రోడ్‌సైడ్ అసిస్టెన్స్, రిటర్న్ టు ఇన్‌వాయిస్ పేరుతో ద్విచక్ర వాహనాలకు రెండు కవర్‌లను తీసుకొచ్చింది.
ఇదీ చదవండి: హోం లోన్ వద్దు.. పర్సనల్ లోనే కావాలి!
స్మార్ట్‌సేవ్ అనే ఉచిత యాడాన్ కవర్ కింద కార్లను యజమానులు రాయల్ సుందరం గుర్తించిన ట్రస్టెడ్ రిపేర్ షాపులు, గ్యారేజీల్లో సర్వీస్ చేయించినట్టయితే, ఓన్ డ్యామేజ్ కవర్ ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. ద్విచక్ర వాహనం ఏదైనా కారణం వల్ల మార్గమధ్యంలో కదల్లేని స్థితిలోకి వెళితే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కింద సాయాన్ని పొందొచ్చు. రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్‌లో వాహనానికి నష్టం జరిగితే పూర్తి విలువ మేర చెల్లింపులు ఉంటాయి.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!