రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?

Royal enfield himalayan recalled for brake issue - Sakshi

అతి తక్కువ కాలంలోనే యువ రైడర్ల మనసు దోచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు సుమారు 5,000 యూనిట్ల హిమాలయన్ బైకులకు రీకాల్ ప్రకటించింది. యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ప్రకారం, శీతాకాలంలో రోడ్లను ట్రీట్ చేయడానికి ఉపయోగించే ఉప్పు బైక్ బ్రేక్ పనితీరు తగ్గిస్తుంది, లేదా మొత్తం నష్టానికి కారణమవుతుందని నివేదించింది.

కంపెనీ 2017 - 2021 మధ్య తయారు చేసిన 4,891 యూనిట్ల హిమాలయన్ బైకులు దీనికి ప్రభావయుతమయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ముందుగానే రీకాల్ ప్రకటించింది. ఇందులో భాగంగానే డీలర్లు ప్రభావిత వాహనాల ముందు, వెనుక బ్రేక్ కాలిపర్‌లను రీప్లేస్ చేస్తారు. 2021 తర్వాత విడుదలైన బైకులు ఈ సమస్యకు ప్రభవితమయ్యే అవకాశం లేదు.

గతంలో కూడా హిమాలయన్‌కు రీకాల్ ప్రకటించారు. అప్పుడు యుకె, యూరప్, దక్షిణ కొరియా దేశాలలో రీకాల్ ప్రకటించారు. ఇప్పుడు అదే సమస్యకు గాను అమెరికాలో రీకాల్ ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో ఈ మోడల్ బైకులకు రీకాల్ ప్రకటించడంపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇప్పటివరకు భారతదేశంలోని బైకులలో ఎటువంటి సమస్య నమోదు కాకపోవడం గమనార్హం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top