‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్‌ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు

Rishad Premji Disclosure Wipro Fired Senior Employee In 10 Minutes For Integrity Violation - Sakshi

మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారనే కారణంగా ప్రముఖ టెక్‌ దిగ్గజం విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో ఆ సంస్థ యాజమాన్యంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో తమ సంస్థకు చెందిన ఓ టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌ను ఫైర్‌ చేసినట్లు విప్రో ఛైర్మన్‌ రషీద్‌ ప్రేమ్‌జీ బహిర్ఘతం చేశారు.

బెంగళూరు కేంద్రంగా జరిగిన నాస్కామ్‌ ప్రొడక్ట్‌ కన్‌క్లేవ్‌ కార్యక్రమంలో రషీద్‌ ప్రేమ్‌జీ మాట్లాడారు. విప్రోలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న టాప్‌ - 20 ఎగ్జిక్యూటీవ్‌లలో ఓ ఉద్యోగి సంస్థ మోరల్స్‌ను ఉల్లంఘించారు. సంస్థకు అతని అవసరం ఎంటో బాగా తెలుసు. కానీ కొన్నిసమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేం (రషీద్‌ ప్రేమ్‌జీ) అదే చేశాం. కేవలం పదే పది నిమిషాల్లో అతన్ని విధుల నుంచి ఫైర్‌ చేసినట్లు చెప్పారు.  

సదరు సీనియర్‌ ఉద్యోగి మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డారా? లేదంటే ఇంకేదైనా కారణంతో  సంస్థ నుంచి బయటకు పంపారనే విషయంపై విప్రో ఛైర్మన్‌ వెల్లడించలేదు. అయితే విప్రోకు మోరల్స్‌ ఉన్నాయి. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించినా, లేదంటే వేధింపులకు పాల్పడితే ఎవరి ఉద్యోగం ఉండదు. అంతెందుకు నేను ఆ రెండింటిలో ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా విప్రోలో నా ఉద్యోగం కూడా ఉండదని తెలిపారు.   

ఉద్యోగుల తొలగింపు 
సెప్టెంబర్ 21 న, ప్రేమ్‌జీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. విప్రోలో మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో పాటు ఆఫీస్‌ నుంచి విధులు నిర్వహిస్తున్న మొత్తం 300 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. "వాస్తవం ఏంటంటే ఈ రోజు విప్రో కోసం పనిచేసేందుకు చాలా మంది ఉద్యోగులే ఉన్నారు. ఆ ఉద్యోగులే  కాంపిటీటర్‌ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల్లో 300మందిని గుర్తించి ఇంటికి పంపించినట్లు చెప్పిన విషయం తెలిసిందే.

చదవండి👉  మూన్‌లైటింగ్‌ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top