జియోకి స్పెక్ట్రమ్ అమ్మేసిన ఎయిర్‌టెల్‌

RIL share price rises on signing spectrum agreement with Bharti Airtel - Sakshi

ఏపీతో పాటు కొన్ని సర్కిళ్లలో  కొంత భాగం కొనుగోలు 

రూ.1,497 కోట్ల డీల్‌ 

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో తాజాగా కొన్ని సర్కిళ్లలో మరో టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌కి ఉన్న 800 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రంలో కొంత భాగాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్‌టెల్‌కు జియో సుమారు రూ.1,038 కోట్లు చెల్లిస్తుంది. అలాగే సదరు స్పెక్ట్రంనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.459 కోట్లు కూడా చెల్లిస్తుంది.

‘800 మెగాహెట్జ్‌ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 3.75 మెగా హెర్ట్జ్, ఢిల్లీలో 1.25 మెగా హెర్ట్జ్, ముంబైలో 2.50 మెగా హెర్ట్జ్‌ స్పెక్ట్రంను వినియోగించుకునే హక్కులను రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌కు బదలాయించేందుకు ఒప్పందం కుదిరింది‘ అని ఎయిర్‌టెల్‌ తెలిపింది. దీనికి నియంత్రణ సంస్థల అనుమతి రావాల్సి ఉంటుంది. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 41.07 కోట్ల యూజర్లతో జియో అగ్రస్థానంలో ఉండగా, 34.46 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌తో ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది.

చదవండి: 

చౌక వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు ఇవే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top