రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌.. నిశ్చిత్‌ సమృద్ధి

Reliance Nippon launches new plan - Sakshi

ముంబై: రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ.. నిశ్చిత్‌ సమృద్ధి పేరుతో నాన్‌ లింక్డ్‌ సేవింగ్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను ఆవిష్కరించింది. పన్ను రహిత, కచ్చితమైన రాబడులకు ఇందులో హామీ ఉంటుందని సంస్థ ప్రకటించింది. పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి, రిటైర్మెంట్‌ వరకు జీవితంలో వివిధ దశల్లో అవసరాలకు ఈ ప్లాన్‌ అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ఇందులో ఇన్‌కమ్, ఎండోమెంట్‌ అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. తమ అవసరా లకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. అంటే రాబడులు, రక్షణ రెండింటి కలయికే ఈ బీమా ప్లాన్‌. పరిమిత కాలం పాటు అంటే ఏడాది, ఆరేళ్లు, ఏడేళ్లపాటే ప్రీమియం చెల్లించి.. ఎంపిక చేసుకున్నంత కాలం జీవితబీమా రక్షణ పొందొచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top